జీవీఎంసీలో 10 జోన్ల పాలన | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీలో 10 జోన్ల పాలన

Dec 30 2025 6:57 AM | Updated on Dec 30 2025 6:57 AM

జీవీఎ

జీవీఎంసీలో 10 జోన్ల పాలన

ఎందెందు చూసినా.. అవే వైఫల్యాలు
న్యూ ఈయర్‌ వేడుకలకు అనుమతులు తప్పనిసరి

ఈ ఏడాదీ చంద్రబాబు పాలనలో

విశాఖ అభివృద్ధి శూన్యం

వైఎస్సార్‌సీపీ హయాంలో నిర్మాణాల్నే

తమ గొప్పలుగా డప్పులు

భాగస్వామ్య సదస్సులో రూ.లక్షల

కోట్ల ఒప్పందాల పేరుతో బురిడీ

సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను

హిట్‌ వికెట్‌గా అవుట్‌ చేసిన సర్కారు

పదే పదే ఆర్థిక రాజధాని పేరుతో

అబద్ధాలే తప్ప.. అభివృద్ధి లేదు

ఇప్పుడు విశాఖ రీజియన్‌

డెవలప్‌మెంట్‌ పేరుతో

పీపీటీ మాయాజాలం

నాడు వైభవం..

2019 డిసెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటన చేసిన తర్వాత.. నగరం దశ దిశలా పరుగులు తీసింది. గత విశాఖ వేరు.. 2019–24 మధ్యలో అభివృద్ధి చెందిన విశాఖ వేరు అన్న రీతిగా జంక్షన్లు, పర్యాటక ప్రాంతాలు, నగరదారుల రూపురేఖలు మారిపోయాయి. 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. మళ్లీ పాత విశాఖవైపుగా తీసుకెళ్తోంది. 2025 అంతా విశాఖను అభివృద్ధి చేసేశామంటూ మాయమాటలు చెబుతూ.. నగర వైభవాన్ని బంగాళాఖాతంలో ముంచేసిందని విమర్శలొస్తున్నాయి. 2025లో ఏ ఒక్క వర్గాన్నీ సంతోషంగా ఉంచిన రోజు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని అన్ని వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

అన్నదాతల తిప్పలు

ఏడాది అన్నదాతలు అష్టకష్టాలు పడ్డారు. విత్తనాలు దొరక్క, సరైన సమయంలో వర్షాలు కురవక.. ఖరీఫ్‌ తొలిసీజన్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానా పాట్లు పడి.. విత్తులు దొరికిన తర్వాత.. చేను కాపాడుకోవడానికి ఎరువుల కోసం యుద్ధాలే చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నెల రోజుల పాటు కష్టపడి ఎరువులు సంపాదిస్తే.. మోంథా తుపాను వచ్చి.. మొత్తం పంటని నాశనం చేసేసింది. జిల్లాలో 26 గ్రామాల పరిధిలో 415 మంది రైతులకు చెందిన 286.88 ఎకరాలు పంటలు తుపాను ముంపునకు గురైతే.. పరిహారం పూర్తిస్థాయిలో ఇవ్వని దుస్థితిలో ఉంది.

2025.. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తానంటూ చంద్రబాబు చెప్పిన అబద్ధాలకు సాక్ష్యంగా మారింది. భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులంటూ.. చంద్రబాబు ప్రభుత్వ అంకెల గారడీ పోటీల్లో 2016, 2017, 2018ని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వైపు పరుగులు తీయగా ప్రేక్షకపాత్ర పోషించింది. గత ప్రభుత్వం మొదలెట్టిన ప్రాజెక్టులు పూర్తయితే, వాటిని ప్రారంభించి తమ ఖాతాలో వేసుకున్న క్రెడిట్‌ చోరీకి ప్రధాన సాక్షిగా నిలిచింది. సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను హిట్‌ వికెట్‌గా అవుట్‌ చేయగా.. అంపైర్‌ అవతారమెత్తింది. ఇలా.. చంద్రబాబు సర్కారు తిమ్మిని బమ్మిని చేసి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లతో అరచేతిలో వైకుంఠాన్ని చూపించి 2025 సంవత్సరాన్ని గంగార్పణం చేసేసింది. ఈ ప్రభుత్వం 2025లో ఏం చేసిందని వెనక్కి తిరిగి చూసుకుంటే గ్రాఫిక్స్‌ మాయాజాలమే తప్ప.. ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదన్నది స్పష్టమవుతోంది.

– సాక్షి, విశాఖపట్నం

పర్యాటక మాయలేనా.?

ర్యాటక రాజధానిగా విశాఖను మారుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రాజెక్టు పనులు కూడా మొదలు పెట్టలేదు. కై లాసగిరిపై ఇటీవల గ్లాస్‌ బ్రిడ్జ్‌ ప్రాజెక్టు తమ ఘనతేనంటూ నిస్సిగ్గుగా బాకాలు ఊదుకుంటోంది. కానీ.. ఈ ప్రాజెక్టుకు 2024 జనవరిలోనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సూచనల మేరకు లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌ (ఎల్‌వోఈ) ఇచ్చారు. వీఎంఆర్‌డీఏ ఆవరణలో ది డెక్‌ భవనం పనులు కూడా గత ప్రభుత్వ హయాంలో 80 శాతం వరకూ పూర్తయ్యాయి. ఒక్క ప్రాజెక్టు తీసుకురాకపోగా.. యాత్రీనివాస్‌, ఇతర పర్యాటక స్థలాలు, భవనాలు ప్రైవేటుకు ధారాదత్తం చేసేసింది.

సింహాచలం: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఉత్తర రాజగోపురంలో మంగళవారం ఉదయం 5.30 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వైకుంఠనారాయణుడిగా శ్రీదేవి, భూదేవి సమేతుడై దర్శనమివ్వనున్నాడు. సుమారు 50 వేల మంది భక్తులు ఈసారి స్వామి దర్శనానికి వస్తారని అంచనా వేశారు. ఉచిత దర్శనం క్యూతోపాటు రూ.100, రూ..300 దర్శన క్యూలు, రూ.500 ప్రత్యేక దర్శన క్యూ, ప్రోటోకాల్‌ వీఐపీల క్యూలు ఏర్పాటు చేశారు. ఉత్తరరాజగోపురం ఎదురుగా భక్తులు క్యూల్లో నడుస్తూనే 15 నిమిషాలపాటు స్వామిని దర్శించుకునే ఏర్పాటు చేశారు. అలాగే ఉత్తరద్వారం దర్శనం కాగానే నేరుగా ఆలయంలోకి వెళ్లి నీలాద్రిగుమ్మం నుంచి మూలవిరాట్‌ దర్శనం చేసుకునేలా క్యూలు రూపొందించారు. ఆలయ రాజగోపురం, ఉత్తర రాజగోపురం, ఆలయ ప్రాంగణాలకు విద్యుద్దీపకాంతులు చేకూర్చారు. భారీ ఎత్తున పుష్పాలంకరణ చేశారు. ఉదయం 4 గంటల నుంచి సింహగిరికి ఆర్టీసీ, దేవస్థానం బస్సులు ప్రారంభమవుతాయి. సుమారు లక్ష లడ్డూల ప్రసాదాన్ని విక్రయానికి సిద్ధం చేశారు. సింహగిరిపైన, కొండదిగువ కలిపి మొత్తం ఆరుచోట్ల మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. 190 మంది లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు విధులు నిర్వర్తిస్తారని గోపాలపట్నం సీఐ ఎల్‌.ఎస్‌.నాయుడు తెలిపారు.

నేటి నుంచి రాత్రి 7 గంటల వరకే దర్శనాలు

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు మంగళవారం నుంచి జనవరి 9వ తేదీ వరకు రాత్రి 7 గంటల వరకు మాత్రమే లభిస్తాయని అధికారులు తెలిపారు. ఆలయంలో జరిగే రాపత్తు ఉత్సవాల సందర్భంగా ఈ మార్పు చేసినట్టు పేర్కొన్నారు.

రూ.కోట్లు ఖర్చు చేసినా వెలవెలబోయిన పార్టనర్‌ షిప్‌ సమ్మిట్‌

పీ4 పేరుతో

పేదలకు మోసం.!

పీ–4 విధానంతో సమాజంలో అట్టడుగున్న ఉన్న పేద కుటుంబాల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి.. బంగారు కుటుంబాలుగా మార్చుతామంటూ బీరాలు పలుకుతున్న కూటమి ప్రభుత్వం.. ఏడాది గడిచినా మొండిచెయ్యి చూపిస్తోంది. 2025 ఉగాది నాటికి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపుతామంటూ చంద్రబాబు బాకాలు కొట్టారు. 2026లో వస్తున్నా ఆ ఛాయలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. జిల్లాలో 70 వేల బంగారు కుటుంబాలను గుర్తించారు. ఈ కుటుంబాల్ని దత్తత తీసుకునే మార్గదర్శులు దొరక్క.. ప్రభుత్వం ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో.. ఇప్పటివరకూ 10 శాతం కుటుంబాలకు మాత్రమే మార్గదర్శులు దొరికారంటే బాబు పాలన ఎలా ఉందో స్పష్టమవుతోంది.

పర్యావరణాన్ని ‘గాలి’ కొదిలేసింది.!

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గాలి కాలుష్య నియంత్రణకు రూ.39.6 కోట్లు ఖర్చు చేసి.. పర్యావరణానికి పెద్దపీట వేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రజల ఆరోగ్యంపై శీతకన్నేశారు. దీంతో దేశంలోనే రెండో స్థానానికి వాయు కాలుష్య స్థాయిలు ఎగబాకాయంటే.. ఇక్కడ పీల్చే గాలి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. 2019 డిసెంబర్‌లో పీఎం10 స్థాయిలు 108 ఉండగా.. 2021 నాటికి 90కి చేరుకుంది. 2025 డిసెంబర్‌లో మాత్రం ఇది 3 రెట్లకు పైగా పెరిగి 308కి చేరుకుందంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో తెలుస్తోంది.

సింహాచలం చరిత్రలో

తొలిసారిగా ఘోరం.!

చరిత్ర కలిగిన సింహాద్రి అప్పన్న దేవాలయంలో 2025 ఓ విషాద మరకగా మారిపోయింది. ఏటా నిర్వహించే సింహాద్రి అప్పన్న నిజరూపదర్శన భాగ్యం చందనోత్సవం ఏర్పాట్లలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఏప్రిల్‌ 30న దర్శనం మొదలైన కాసేపటికే గోడ కూలి.. ఏడుగురు భక్తులు కొండపైనే మృత్యుఒడికి చేరుకున్నారు.

ప్రతి అంశంలోనూ మోసమే.!

తమకు నచ్చిన కంపెనీలకు విశాఖలో భూములను ఽకారు చౌకగా కట్టబెట్టేసింది. అనేక నగరాల్లో లూలూ సంస్థ సొంత భూములు కొనుగోలు చేసి కన్వెన్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తే.. విశాఖలో మాత్రం రూ.వేల కోట్లు విలువ చేసే భూముల్ని ఎకరం 99 పైసలకే ఆ సంస్థకు కట్టబెట్టింది. ఇదే తీరులో ఊరు పేరు లేని ఉర్సా వంటి సంస్థలకు కూడా భూ పందేరాలు చేసేసింది.

గత ప్రభుత్వం పక్కగా మెట్రో డీపీఆర్‌ని తయారు చేస్తే కేంద్రం ఆమోదముద్ర వేసే సమయానికి ఆపించేసి.. మార్పులు చేస్తామంటూ మోసం చేసింది. ఇప్పుడు డీపీఆర్‌ ఆమోదం లేకుండా టెండర్లు పిలిచి.. ఇదిగో మెట్రో అంటూ హడావుడి చేసి.. టెండర్లను కూడా వాయిదా వేస్తూ వస్తోంది.

ఎన్నికల ముందు స్టీల్‌ప్లాంట్‌ని కాపాడే బాధ్యత తనదంటూ చెప్పిన చంద్రబాబు.. ఇటీవల ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై ప్రశ్నించిన ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. మీరేం పనిచేస్తున్నారు అంటూ వీరంగమాడారు. 2025లోనే ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడ్డాయంటే.. బాబు మోసం ఎలా ఉందో అర్థమవుతోంది.

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ పేరుతో విశాఖవేదికగా 2016, 2017, 2018లో సదస్సులు నిర్వహించారు. ఒక్కో ఏడాది రూ.5 లక్షల కోట్లు, రూ.2 లక్షల కోట్లు, రూ.7 లక్షల కోట్లు అంటూ ఊదరగొట్టారు. అందులో ఒక్క శాతం కూడా కార్యరూపం దాల్చలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు మరోసారి అంకెల గారడీ చేశారు. 2025లో నిర్వహించిన సమ్మిట్‌లో ఏకంగా రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ మాయ చేశారు. ఇందులో సగానికి పైగా పెట్టుబడులు 2023లో వైఎస్సార్‌సీపీ హయాంలో 2023లో నిర్వహించిన జీఐఎస్‌ సమ్మిట్‌లో వచ్చినవే కావడం కొసమెరుపు.

విశాఖ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో వందల పేజీల పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌తో గ్రాఫిక్‌ మాయాజాలంతో మరోసారి మభ్యపెట్టారు.

ఇలా.. ‘ఇందుగలడందులేడు.. ఎందెందు వెతికినా.. అందందే.. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు కనబడును’ అన్నట్లుగా 2025లో చంద్రబాబు పాలన పాలిపోయింది.

దర్శన వివరాలు

ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు ఉత్తరద్వార దర్శనాలు ముగిసినా.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు మూలవిరాట్‌ దర్శనాలు ఉంటాయి.

జీవీఎంసీలో 10 జోన్ల పాలన1
1/6

జీవీఎంసీలో 10 జోన్ల పాలన

జీవీఎంసీలో 10 జోన్ల పాలన2
2/6

జీవీఎంసీలో 10 జోన్ల పాలన

జీవీఎంసీలో 10 జోన్ల పాలన3
3/6

జీవీఎంసీలో 10 జోన్ల పాలన

జీవీఎంసీలో 10 జోన్ల పాలన4
4/6

జీవీఎంసీలో 10 జోన్ల పాలన

జీవీఎంసీలో 10 జోన్ల పాలన5
5/6

జీవీఎంసీలో 10 జోన్ల పాలన

జీవీఎంసీలో 10 జోన్ల పాలన6
6/6

జీవీఎంసీలో 10 జోన్ల పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement