విశాఖ – అరకు మధ్య రైళ్లు
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం–అరకు– విశాఖపట్నం మధ్య స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్‌కుమార్ తెలిపారు. విశాఖపట్నం–అరకు(08525) స్పెషల్ రైలు ప్రతీ రోజు విశాఖపట్నంలో ఉదయం 8.40 గంటలకు బయల్దేరి అదేరోజు ఉదయం 12.30 గంటలకు అరకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అరకు–విశాఖపట్నం (08526) స్పెషల్ రైలు అరకులో ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు నడుస్తాయి. ఈ రైళ్లు ఇరువైపులా సింహాచలం, కొత్తవలస, శృంగవరపుకోట, బొర్రాగుహలు, స్టేషన్‌ల్లో ఆగుతాయి.
● విశాఖపట్నం–షాలిమర్(08507) స్పెషల్ రైలు ప్రతీ మంగళవారం విశాఖలో ఉదయం 11.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు(బుధవారం) తెల్లవారు 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు ఫిబ్రవరి 24వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగుప్రయాణంలో షాలిమర్– విశాఖపట్నం (08508) స్పెషల్ ప్రతీ బుధవారం షాలిమర్‌లో తెల్లవారు 5గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.50గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు ఫిబ్రవరి 25వ తేదీ వరకు నడుస్తాయి.


