● ఇద్దరు యువకుల దుర్మరణం ● నుజ్జునుజ్జయిన వాహనం ● మృతుల
చెట్టును ఢీకొట్టిన వ్యాన్
గజపతినగరం: గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన పొట్నూరు వినయ్ కుమార్ (35), ఎల్లాబిల్లి దినేష్ (24) శనివారం సాయంత్రం బేకరీ సామగ్రి లోడుతో విశాఖపట్నం నుంచి ఒడిశాలోని రాయగడ వెళ్లారు. అక్కడ పని ముగించుకొని ఆదివారం తిరిగి వస్తుండగా, గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతదేహాలు వాహనంలోనే ఇరుక్కుపోయి, గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. సమాచారం అందుకున్న గజపతినగరం ఎస్‌ఐ కె.కిరణ్ కుమార్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పొక్లెయిన్ సాయంతో వ్యాన్‌ను పక్కకు తీసి, అందులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వినయ్‌కుమార్ భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, దినేష్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్దలు మరణించడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. దినేష్ తల్లి ఎల్లబిల్లి శంకరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
● ఇద్దరు యువకుల దుర్మరణం ● నుజ్జునుజ్జయిన వాహనం ● మృతుల


