డాక్టర్ కమల్ బయిద్‌కు ‘ఐకానిక్ అశోక’ పురస్కారం
ఎంవీపీకాలనీ: ఏసీఎన్ ఇన్ఫోటెక్ డైరెక్టర్ డాక్టర్ కమల్ బయిద్‌కు ప్రతిష్టాత్మక ఐకానిక్ అశోక అవార్డ్ లభించింది. ఢిల్లీలో శనివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఐకానిక్ పీస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. గత 50 ఏళ్లుగా సామాజిక సేవా రంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా కౌన్సిల్ ఈ అవార్డును అందజేసింది. ఎంవీపీకాలనీకి చెందిన కమల్ బయిద్.. గత ఐదు దశాబ్దాలుగా రోటరీ క్లబ్, వాకర్స్ ఇంటర్నేషనల్, మహావీర్ ఇంటర్నేషనల్, జైన్ శ్వేతాంబర్ తెరాపంత్ సభ వంటి సంస్థల ద్వారా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ సంక్షేమంతో పాటు క్రీడలు, పోలియో, హెచ్‌ఐవీ, కోవిడ్ అవగాహన, నిర్మూలనపై పెద్ద ఎత్తును అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని పలు క్లబ్‌లకు అధ్యక్షుడిగా, గవర్నర్‌గా కూడా ఆయన వ్యవహరించారు. ఈ అవార్డు దక్కించుకున్న సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా సంఘాల ప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలిపారు.


