సమస్యలపై ఏకరువు
(9వ పేజీ తరువాయి)
మూడు గంటల పాటు జీరో అవర్
ముందుగా గంటన్నర పాటు జీరో అవర్ కేటాయిస్తున్నట్లు మేయర్ ప్రకటించినా.. సభ్యులు తమ అభిప్రాయాలు, సమస్యలు చెప్పడంతో మధ్యాహ్నం 2 వరకు అంటే మొత్తం 3 గంటల పాటు కొనసాగింది. ప్రోటోకాల్‌పై ఆందోళన
జీవీఎంసీ 20వ వార్డు కార్పొరేటర్ నెక్కెల లక్ష్మి, 58వ వార్డు కార్పొరేటర్ గులిగిందల లావణ్య సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ప్రోటోకాల్‌పై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు కౌన్సిల్‌లో ఆమోదం పొంది, వార్డుల్లో పనులు చేపడితే.. స్టడీ టూర్‌కు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాలు చేశారని, స్థానిక కార్పొరేటర్ల పేర్లు కూడా శిలాఫలకాల్లో పెట్టడం లేదని మండిపడ్డారు.
జనసేన వర్సెస్ మేయర్
జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు మేయర్ పీలా శ్రీనివాసరావుపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కూటమిలో తాము కూడా భాగస్వాములే అయినప్పటికీ.. మేయర్ తమ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు. టీడీపీ కార్పొరేటర్లకు అనుకూలంగా దాదాపు రూ.100 కోట్ల పనులు, మేయర్ తన వార్డులోనే రూ.8 కోట్ల పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. దీనికి మేయర్ స్పందిస్తూ ‘అసలు మీ ఎమ్మెల్యే ఎవరు?’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడటంతో అందరూ ఒక్కసారి నవ్వేశారు. దీంతో తాము ప్రోత్సహిస్తేనే మేయర్ అయ్యారని నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి వచ్చిన తర్వాత మేయర్ మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయి తే, అదే పార్టీకి చెందిన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్.. నాగరాజును కూర్చోమని వారించి, తానే మాట్లాడతానని చెప్పడం గమనార్హం.
️-A-{MýSÐ]l$ °Æ>Ã-×êÌSOò³ B{VýSçßæ…
● చిరు వ్యాపారులను ఖాళీ చేయిస్తూ.. బిల్డర్లు ఫుట్‌పాత్‌లను ఆక్రమించినా, సెట్‌బ్యాక్‌లు లేకుండా నిర్మాణాలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు ప్రశ్నించారు.
● వీధి లైట్లు సరిగా వెలగడం లేదని, రేసపువానిపాలెం గెడ్డ శుభ్రం చేయించి, చెత్త వేయకుండా మెస్‌లు ఏర్పాటు చేయాలని స్థాయీ సంఘ సభ్యురాలు సాడి పద్మారెడ్డి కోరారు.
● భానోజీనగర్, పితానిదిబ్బలో సమస్యలు ఉన్నాయని, దోబీ ఘాట్ పనులు ప్రారంభించి, సామాజిక భవనం నిర్మించాలని పల్లా అప్పలకొండ కోరారు.
● వార్డులో తీవ్రమైన నీటి సమస్య ఉందని, కేఆర్‌ఎం కాలనీలో రోడ్లు తవ్వి వదిలేశారని, వీధి దీపాలు సరిగా వెలగడం లేదని మొల్లి లక్ష్మి తెలిపారు.
● ఎస్సీ కాలనీ రోడ్డు విస్తరణలో తొలగించిన ఇళ్లకు టీడీఆర్‌లు ఇవ్వలేదని, వార్డు కార్యాలయం లేక సి బ్బంది ఇబ్బంది పడుతున్నారని, ఎస్సీ, ఎస్టీ నిధులతో అభివృద్ధి చేయాలని రెయ్యి వెంకటరమణ కోరారు.
● కొండవాలు ప్రాంతం కారణంగా సమస్యలున్నాయని, సోలార్ లైట్లు, స్పీడ్ బ్రేకర్లు, యూజీడీ పనులు పూర్తి చేయాలని అక్కరమాని రోహిణి కోరారు.
● అసాంఘిక కార్యకలాపాలకు ముడసర్లోవ పార్కు అడ్డాగా మారిందని కార్పొరేటర్ కెల్లా సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రమైతే గంజాయి, మందుబాబులు అక్కడ చేరి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
131 అంశాలు ఆమోదం
సమావేశంలో 131 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో 90 అంశాలు కలిగిన ప్రధాన అజెండాతో పాటు 42 అంశాలతో టేబుల్ అజెండాను కలుపుకొని మొత్తంగా 132 అంశాలను పొందుపరి చామన్నారు. మొత్తం అంశాలను చర్చించి 131 అంశాలు ఆమోదించినట్లు తెలిపారు. రెల్లి వీధి పేరు మా ర్పు అంశాన్ని తిరస్కరించినట్లు మేయర్ తెలిపారు.
యాదవ భవన్‌పై రగడ
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎండాడలో యాదవ భవన నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 50 సెంట్ల భూమిని కేటాయించారని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అక్కరమాని రోహిణి, ఉరుకూటి చందు, నెక్కెల లక్ష్మి, పల్లా అప్పలకొండ, మొల్లి లక్ష్మీతో పాటు పలువురు యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు తెలిపారు. అలాంటిది ముడసర్లోవలో యాదవ భవన్ ఏర్పాటుకు స్థల కేటాయింపు అంశం ఎందుకు చేర్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఎండాడలోని స్థలంతో పాటు.. ముడసర్లోవలో కూడా యాదవ సామాజిక వర్గానికి కేటాయిస్తారా.? ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే ఈ అంశాన్ని మేయర్ దాటవేశారు.


