ఎంఎస్‌ఎంఈ రుణ ప్రోత్సాహక కార్యక్రమం
విశాఖ సిటీ : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ రుణ ప్రోత్సాహిక కార్యక్రమాన్ని వైజాగ్‌పట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్–ఇండస్ట్రీలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేవీసీ జాయింట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, కేవీబీ జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రమౌళి, డీసీ జనరల్ మేనేజర్ ఆదిశేషుతో పాటు బ్యాంక్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సబ్సిడీలు, వాటి అర్హత ప్రమాణాలు, ప్రయోజనాలను అధికారులు వివరించారు. బ్యాంక్ అందిస్తున్న ప్రధాన రుణ పథకాలు సెంట్రల్ బిజినెస్ సెంట్ జీఎస్టీ, సెంట్ టెక్స్‌టైల్స్, సెంట్ షాప్, సెంట్ రైస్‌మిల్, సెంట్ హోటల్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలు జిల్లాల పరిధిలోని కస్టమర్లకు రూ.13 కోట్లు విలువైన ఎంఎస్‌ఎంఈ రుణ మంజూరు పత్రాలను అందజేశారు.


