వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా కమిటీలో పలువురికి చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగ కమిటీలో పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా గరికిముక్కల పాల్ విక్టర్(విశాఖ నార్త్), పార్టీ విశాఖ జిల్లా కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా రెయ్యి డేవిడ్ రాజు(విశాఖ దక్షిణ)ను నియమించారు. అదేవిధంగా వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా సాంస్కృతిక విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా రెడ్డి జీవన కిరణ్మయి(విశాఖ తూర్పు), జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా దాలై ఈశ్వరరావు(విశాఖ తూర్పు), జిల్లా అంగన్‌వాడీ వింగ్ కార్యదర్శిగా జానకీ దేవి, జిల్లా లీగల్ సెల్ సెక్రటరీగా దవళ క్రిష్టి రాజ్యం(విశాఖ తూర్పు), జిల్లా క్రిస్టియన్ మైనారిటీ కార్యదర్శిగా కొండల విమల(విశాఖ తూర్పు), జిల్లా మైనారిటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా షేక్ హజారతల్లి(విశాఖ తూర్పు), జిల్లా అంగన్‌వాడీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా బమ్మడి పుణ్యవతిని నియమించారు.


