తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ శనివారం కేకే లైన్ పరిధి శివలింగపురంలో తనిఖీలు నిర్వహించారు. ఈ స్టేషన్‌లో జరుగుతున్న భద్రతా పనులను పరిశీలించారు. సిగ్నలింగ్, ట్రాక్‌ల పెంపు, పాయింట్స్, క్రాస్ ఓవర్స్, ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ వంటి పనులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో నిత్యం జరిగే ఇనుప ఖనిజ రవాణాను దృష్టిలో ఉంచుకుని, భద్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని డీఆర్‌ఎం సూచించారు. ఆయన వెంట ఏడీఆర్‌ఎం (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)సుధీర్‌కుమార్ గుప్తా, సీనియర్ డివిజనల్ ఇంజినీర్ విజేంద్ర కుమార్, సీనియర్ డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికం ఇంజినీర్ దీప్తాన్షు శర్మ, సీనియర్ డివిజన్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ (ట్రాక్షన్) పండి టాం, సీనియర్ డివిజన్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఆపరేషన్స్ ఎస్.పర్వతం తదితరులు ఉన్నారు.