
మధురవాడ పవన్‌మిత్ర అపార్ట్‌మెంట్‌లో రాత్రి 10.20 గంటలకు ప్రచారం నిర్వహిస్తున్న గంటా
మధురవాడ: భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల నియమావళికి తూ ట్లు పొడిచారు. జీవీఎంసీ 5వ వార్డు వైఎస్సార్ కాలనీ, గాయత్రీ మెడికల్ కళాశాల సమీపంలోని పవన్ మిత్ర అపార్ట్‌మెంట్ వద్ద రాత్రి 10 గంటల తర్వాత కూడా ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ కాలనీలో టీడీపీ నాయకులు రాత్రి 10 గంటలకు బాణసంచా కాల్చారు. తర్వాత రోడ్డు మధ్యలోనే ఫొటోలు దిగుతూ గంటా అభివాదం చేశారు. రాత్రి 10.15 గంటలకు పక్కనే ఉన్న పవన్ మిత్ర అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ప్రచారం చేశారు. 10.25 గంటలకు వైఎస్సార్ కాలనీలో మహిళలతో ముచ్చటించి గ్రూప్ ఫొటో దిగారు. అర గంట పాటు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గంటా ప్రచారం నిర్వహించినా అధికారులు, పోలీసులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు.