వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం | - | Sakshi
Sakshi News home page

వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

Sep 25 2023 1:00 AM | Updated on Sep 25 2023 9:30 AM

- - Sakshi

గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం బయలు దేరిన కొద్ది సేపటికే తిరిగి వచ్చేసింది. ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ బయలు దేరిన ఎయిర్‌ ఇండియా విమానం సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం 6.30 గంటలకు తిరిగి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విమానంలో జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు అనంత్‌ నాయక్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు ఉన్నారు. 165 మంది ప్రయాణికులకు విమానాయాన సంస్థ ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement