తాండూరు రూరల్: గ్యాస్ సిలిండర్ పేలి, గుడిసె దగ్ధమైన ఘటన పెద్దేముల్ మండలం గిర్మాపూర్లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒంటరి మహిళ హరిజన్ సత్తమ్మ గుడిసెలో నివసిస్తోంది. గురువారం ప్రమాదవశాత్తు సిలిండర్ పేలడంతో మంటలు అంటుకుని గుడిసె కాలిపోయింది. బాధితురాలు స్థానికులకు చెప్పడంతో బిందెలతో నీళ్లు పోసి, మంటలను ఆర్పేశారు. అప్పటికే రూ.26 వేల నగదు సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ప్రతినిధులు బాధితురాలికి ఆర్థిక సాయం అందించారు.


