రీ సర్వేతో భూ వివాదాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేతో భూ వివాదాలకు చెక్‌

Nov 13 2026 8:33 AM | Updated on Nov 13 2026 8:33 AM

మర్పల్లి: భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే ప్రభుత్వం భూ రీసర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. మండల పరిధిలోని వీర్లపల్లిలో కొనసాగుతన్న సర్వేను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన వీబీజీరాంజీ పనులతో పాటు పెన్షన్‌ దరఖాస్తులు, వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం సర్పంచ్‌ సుక్కారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. సర్వేలో వివాదాలకు తావు లేకుండా చూడాలన్నారు. ఏ గ్రామం, ఏఏ సర్వే నంబర్లలో ఎప్పుడు సర్వే చేస్తారో ఒకరోజు ముందుగానే రైతులకు సమాచారం అందించాలని సూచించారు. ఇప్పటికే గ్రామంలో ఎనభై శాతం సర్వే పూర్తయిందని, మిగిలిన ఇరవై శాతాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బందికి సహకరించాలని స్థానికులు, రైతులకు సూచించారు.

ఇంకుడు గుంతలు నిర్మించాలి

ప్రతీ వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టేందుకు వీబీజీరాంజీ పథకంలో నీటి గుంతలు, బోర్‌వెల్‌ రీఛార్జ్‌ పనులు, చెక్‌డ్యాంలు, ఊట కుంటలు, సామూహిక ఇంకుడు గుంతలు నిర్మించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రభుత్వ భవనాల వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. గ్రామంలోని మహిళా సమాఖ్య భవనం, పంచాయతీ భవనాలకు వీబీజీరాంజీ పథకం కింద ప్రహరీలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. భూభారతి పెండింగ్‌ పనులు, చేయూత పింఛన్‌ దరఖాస్తులపై ఆరా తీశారు. అర్హులందరికీ పెన్షన్‌ అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, సర్వే అండ్‌ రికార్డ్స్‌ ఏడీ మధుసూదన్‌, ఎంపీడీఓ శాంత, తహశీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి, ఎంఈఓ అశోక్‌, సర్పంచ్‌ చుక్కారెడ్డి, ఏపీఓ అంజిరెడ్డి, ఉప సర్పంచ్‌ దివ్వ, సర్వేయిర్లు, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

రుణ ఉపశమన చర్యలు చేపట్టాలి

అనంతగిరి: కరువు ప్రభావిత ప్రాంతాల రైతులకు ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక ఉపశమన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకుల పనితీరు, వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాల సాధన, వ్యవసాయ రుణాల పంపిణీ, ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలకు రుణాలు, కరువు ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు అందించాల్సిన ప్రత్యేక ఆర్థిక ఉపశమన చర్యలపై చర్చించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని ఇరవై మండలాలను కరువుగా ప్రకటించిన నేపథ్యంలో రైతుల రుణ ఖాతాలను పరిశీలించి, అవసరమైన రుణ పునర్‌వ్యవస్థీకరణ, చెల్లింపు గడువు పొడిగింపు అంశాలను పరిశీలించాలని సూచించారు. పంట, వ్యవసాయ పెట్టుబడి, పశుపోషణ, అనుబంధ రంగాల రుణాలపై ఉపశమన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ డేవిడ్‌ విల్సన్‌, మెప్మా పీడీ రవి కుమార్‌, డీఏఓ కవిత, పరిశ్రమల అధికారి శివ కుమార్‌, రిజర్వ్‌ బ్యాంక్‌ ఏజీఎం శ్రీకాంత్‌, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఏజీఎం ఉదయ్‌ కిరణ్‌, కెనరా, యూబీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దీపక్‌ తివారి

వీర్లపల్లిలో సర్వే పనుల పరిశీలన

భూ భారతి, పెన్షన్‌ దరఖాస్తులపై ఆరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement