పరిగి: అఖిల భారత కిసాన్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య అన్నారు. గురువారం పట్టణంలో మహాసభల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాయుధ రైతాంగ పోరాట పురిటిగడ్డ నల్గొండ పట్టణ కేంద్రంలో ఈనెల 15 నుంచి 18 వరకు మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు హబీబ్, సత్తయ్య, రఘురాం, నరసింహులు, వెంకటయ్య, మహాబుబ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: వికారాబాద్‌లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ ఎంఏ ఘని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈనెల 16లోగా అప్లికేషన్లు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు 9491492900లో సంప్రదించాలని సూచించారు.
పరిగి: పరిగి సబ్ జైలర్‌గా శివ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న రాజ్‌కుమార్ చర్లపల్లి జైలుకు బదిలీపై వెళ్లారు. అక్కడ జైలర్‌గా విధులు నిర్వహిస్తున్న శివ పరిగికి వచ్చారు.
దోమ: మండలంలోని ఊటుపల్లికి చెందిన మంగళి తేజస్విని అండర్– 14 షాట్‌పుట్ విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఇటీవల వరంగల్‌లో నిర్వహించి న అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి నేషనల్ లెవల్‌కు ఎంపికై ంది. మంగళి జగన్, రాఘవేంద్రమ్మ దంపతుల కుమార్తె తేజస్విని బషీరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్న విద్యార్థినిని హె చ్‌ఎం శివగీత, వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతి, గ్రామస్తులు అభినందించారు.
అనంతగిరి: టీయూడబ్ల్యూజే(హెచ్143) వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు రవీందర్ తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ప్రహ్లాదచారి, కోశాధికారిగా బొబ్బిలి రాజు, జిల్లా ఉపాధ్యక్షులుగా మాలేకాడి మల్కయ్యగౌడ్, శివశంకర్, సయ్యద్ జావీద్, సంయుక్త కార్యదర్శులుగా పట్లూర్ నర్సింలు, ఎం.అశోక్‌గౌడ్, కె.అనంతయ్య, కార్యనిర్వాహక కార్యదర్శులుగా విశ్వనాథ్, అయూబ్, గౌరవ సలహాదారులుగా వెంకటేష్, గోపాల్‌రెడ్డి, నర్సయ్య, జైదుపల్లి గోపాల్, ఫహీం ఖాన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా: ఎం.అశోక్, దొంత శ్రీకాంత్, సయ్యద్ అలీ, రమేష్ నాయక్, నక్క చంద్రశేఖర్, అంజిలయ్యను ఎన్నుకున్నారని తెలిపారు. జిల్లా కార్యవర్గం ఏర్పాటు అనంతరం రాష్ట్ర స్థాయి కమిటీకి సీనియర్ జర్నలిస్ట్ బస్వరాజ్, సయ్యద్ జావీద్, సాతాని నర్సింహ, జాతీయ స్థాయి కమిటీకి సయ్యద్ ఆసిఫ్ హుస్సేన్, జి.నర్సింహులు నామినేషన్లు సమర్పించామని తెలిపారు.
మొయినాబాద్: యాదవుల ఐక్యతకు సదర్ ఉత్సవాలు నిదర్శనమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రంలో ఆల్ ఇండియా యాదవ మహాసభ ఆధ్వర్యంలో గురువారం రాత్రి సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గొల్ల కురుమలు పశుసంపదను పూజించి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇదే ఆనవాయితీని ఐక్యతతో కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్, వివిధ పార్టీల నాయకులు, యాదవ మహాసభ నాయకులు పాల్గొన్నారు.


