గొట్టిగ భూముల | - | Sakshi
Sakshi News home page

గొట్టిగ భూముల

Nov 4 2026 8:04 AM | Updated on Nov 4 2026 8:04 AM

గుట్టు తేలేనా..?

బషీరాబాద్‌: మండలంలోని గొట్టిగకలాన్‌ అటవీ భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అటవీ భూముల్లో మట్టి తవ్వకాలు జరిగినా.. అవి ఆ శాఖకి కావంటూ అప్పటి తాండూరు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి (ఎఫ్‌ఆర్‌ఓ) ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం వివాదానికి కారణమైంది. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు వరుస విచారణలు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో తవ్వకాలు జరిగిన ప్రాంతం అటవీ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తాజాగా మంగళవారం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఎఫ్‌ఆర్‌ఓ విష్ణువర్ధన్‌రెడ్డి, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌ఓ షాహీన్‌, బషీరాబాద్‌ సెక్షన్‌ అధికారిణి స్నేహశ్రీ, ఫారెస్ట్‌ బీట్‌ అధికారి మల్లప్పతో కలిసి భూములు తనిఖీ చేసి వాటి హద్దులు, రికార్డులను పరిశీలించారు.

అసలేం జరిగిందంటే..

గొట్టిగకలాన్‌ సర్వే నంబరు 51లో మొత్తం 82 ఎకరాల భూమి ఉంది. ఇందులో 41 ఎకరాలు అటవీశాఖ పరిధిలో ఉండగా.. మిగిలిన 41 ఎకరాలను రైతులకు అసైన్‌మెంట్‌ కింద పంపిణీ చేశారు. 2024 డిసెంబరులో రోడ్డు నిర్మాణం కోసం ఈ ప్రాంతంలో మట్టి తవ్వకాలు జరిగాయి. దీంతో అటవీ అధికారులు ఓ టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే తవ్వకాలు జరిగిన భూమి అటవీశాఖ పరిధిలోకి రాదని, రెవెన్యూ శాఖకు చెందిన అసైన్‌మెంట్‌ భూమి అని అప్పటి ఎఫ్‌ఆర్‌ఓ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగానే టిప్పర్‌ను నామమాత్రపు జరిమానాతో విడిచిపెట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

వరుస తనిఖీలతో కదలిక..

ఈ వివాదంపై గత నెల అక్టోబర్‌ 14న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. సర్వే నంబరు 51కు సంబంధించిన నక్షాలు, రికార్డులను పరిశీలించారు. మట్టి తవ్వకాలు జరిగిన ప్రాంతం అటవీ హద్దుల్లోనే ఉందని, చుట్టూ కందకాలు ఉన్నా యని అటవీ అధికారులు వెల్లడించారు. తాజాగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం కూడా పరిశీలనకు రావడంతో అప్పటి ఎఫ్‌ఆర్‌ఓ నివేదికపై విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. భూముల హద్దులపై తుది నిర్ధారణ ఏమిటి? నివేదికలోని అంశాలపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? బాధ్యులపై చర్యలు ఉంటాయా? అ సలేం తేలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

ఫారెస్టు ల్యాండ్‌పై విచారణ

41 ఎకరాలు అటవీశాఖ పరిధిలో ఉన్నట్లు రికార్డులు

మట్టి తవ్వకాలతో వెలుగులోకి వచ్చిన వివాదం

గత నెల విజిలెన్స్‌ తనిఖీలు

తాజాగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ పరిశీలన

తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement