విద్యార్థుల ప్రగతిపై శ్రద్ధ చూపాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ప్రగతిపై శ్రద్ధ చూపాలి

Nov 4 2026 8:04 AM | Updated on Nov 4 2026 8:04 AM

విద్యార్థుల ప్రగతిపై శ్రద్ధ చూపాలి

జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ శ్రీరామ్‌మస్తాన్‌

పరిగి: విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయుల నిరంతర మూల్యాంకనం చేపట్టాలని జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి శ్రీరామ్‌ మస్తాన్‌ సూచించారు. మంగళవారం పట్టణంలోని నంబర్‌ వన్‌ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాసంవత్సరం ప్రారంభంలో బేస్‌లైన్‌ పరీక్షల ద్వారా విద్యార్థుల ప్రాథమిక సామర్థ్యాలను అంచనా వేసినట్లు తెలిపారు. మిడ్‌లైన్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రాక్టీస్‌ పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. పదో తరగతిలో వందశాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ అంజయ్య, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు గోపాల్‌, ఎండీ ఉస్మాన్‌ అలీ, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement