ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ వెంకటేశ్
తాండూరు రూరల్: ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు నీటిని వృథా చేయరాదని ఆర్‌డబ్ల్యూఎస్ తాండూరు డివిజన్ డీఈ వెంకటేశ్ సూచించారు. శుక్రవారం పట్టణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పబ్లిక్ వాటర్ స్కీం కింద తాండూరు మండలంలో 105 బోర్లు, పెద్దేముల్‌లో 83, యాలాలలో 61, బషీరాబాద్‌లో 96 బోర్లు ఉన్నట్లు తెలిపారు. వీటి ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. సింగిల్ ఫేజ్ మోటర్లతో పాటు మిషన్ భగీరఽథ ద్వారా కూడా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నల్లాలకు ఆన్ అండ్ ఆఫ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని చెప్పారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సబితారెడ్డిని కలిసిన
బీఆర్‌ఎస్ నాయకులు
నవాబుపేట: మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డిని శుక్రవారం బీఆర్‌ఎస్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా పండుగ శుభాకాంక్షులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో దయాకర్‌రెడ్డి, భరత్‌రెడ్డి, పురుషోత్తం, మాణిక్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రాజు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
గడువు పొడిగింపు
అనంతగిరి: ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ పరిధిలో ఉల్లి, వాము పంటల సాగు, మల్చింగ్‌కు సబ్సిడీ పొందేందుకు దరఖాస్తు గడువును నవంబర్ 10వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎంఏ సత్తార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతంలో హెచ్చుతగ్గులు, నీటి లభ్యతలో మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా ఉద్యాన పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. మల్చింగ్ విధానం ద్వారా నేలలో తేమను కాపాడుకోవడం, కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రించడం, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం వంటి ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న రైతులు డివిజన్ ఉద్యాన అధికారులను సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని ఆయన కోరారు.
ఓటరుగా నమోదు
చేసుకోండి
మాజీ ఎమ్మెల్యే ఆనంద్
అనంతగిరి: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని 4, 5వ వార్డుల్లో పట్టభద్రులను కలిశారు. ఓటరుగా నమోదు చేసు కోవాలని కోరారు. పలువురిని ఓటర్లుగా నమో దు చేయించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు శుభప్రద్ పటేల్, విజయ్‌కుమార్, నాగేందర్‌గౌడ్, గోపాల్ ముదిరాజు, కడియాల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


