పరిహారం అందించండి | - | Sakshi
Sakshi News home page

పరిహారం అందించండి

Oct 24 2026 9:50 AM | Updated on Oct 24 2026 9:50 AM

● లేకుంటే బాధిత రైతులతోనిరాహార దీక్ష చేస్తాం ● కేవీపీఎస్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకులు మల్కయ్య, మహేందర్‌

యాలాల: మండలంలోని దౌలాపూర్‌ శివారులో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు కేటాయించిన స్థలానికి సంబంధించి బాధిత రైతులకు పరిహారం అందించాలని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్క య్య, ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు డప్పు మహేందర్‌ డిమాండ్‌ చేశారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే సోమవారం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. శుక్రవారం యాలాలలో భూ బాధితులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దౌలాపూర్‌లోని సర్వే నంబరు 73లో 25 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెట్‌ పాఠశాలకు కేటాయించారన్నారు. ఇదే స్థలంలో దౌలాపూర్‌, చెన్నారం తదితర గ్రామాలకు చెందిన దళితులకు ప్రభుత్వ భూమి కేటాయించారన్నారు. మొన్నటి వరకు ఆ భూమిని నమ్ముకుంటూ బతుకుతున్న పేదలకు ఎలాంటి సమాచారం లేకుండా లాక్కోవడం తగదన్నారు. భూ బాధితులకు వెంటనే పరిహారం అందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధిత రైతులు నర్సింహులు, మల్కప్ప, బాలరాజ్‌, వెంకటయ్య, చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement