స్వీయ గణనను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

స్వీయ గణనను ప్రోత్సహించాలి

Oct 24 2026 9:50 AM | Updated on Oct 24 2026 9:50 AM

● అదనపు కలెక్టర్‌ వెంకటాచారి

అనంతగిరి: స్వీయ జనగణన చేసుకునేలా విద్యావంతులను ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్‌ వెంకటాచారి సూచించారు. జనగణన 2027 రెండో దశపై జిల్లా, సబ్‌ డివిజనల్‌, చార్జ్‌ ఆఫీసర్లు, అదనపు చార్జ్‌ అధికారులకు శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలన్నారు. ఉద్యోగులు, విద్యావంతులు స్వీయ జనగణనలో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. సేకరించే వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలన్నారు. రికార్డుల ఆధారంగా భూదాన్‌ భూముల వివరాలు సేకరించాలని ఆదేశించారు. తాజా సమాచారంతో నవీకరించాలని తెలిపారు. హైకోర్టు పెండింగ్‌ కేసులకు సంబంధించి ప్రత్యేకమైన రిజిస్టర్లలో నమోదు చేసి ఎప్పటికప్పుడు వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని తెలిపారు. భూములకు సంబంధించిన రికార్డులను పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించడం ద్వారా భూముల పరిరక్షణకు, అర్హులైన లబ్ధిదారుల ప్రయోజనాల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించిన వారమవుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీపీఓ వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ప్రణాళిక శాఖ విశ్రాంతి డైరెక్టర్‌ దయానంద్‌, ఏడీ రవిచంద్ర, శిక్షణాధికారి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement