ఎల్‌నినో విపత్తును ఎదుర్కొందాం | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో విపత్తును ఎదుర్కొందాం

Oct 17 2026 8:18 AM | Updated on Oct 17 2026 8:18 AM

● సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలి ● రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ● స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌

అనంతగిరి: ప్రకృతి విపత్తు ఎల్‌నినోను ప్రజలందరూ కలసికట్టుగా ఎదుర్కోవాలని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం వికారాబాద్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గడ్డం అనన్యతో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రకృతి విపత్తు అని, వంద దేశాలపై ప్రభావం ఉందన్నారు. ప్రజలు, రైతులు అధికారుల సూచనలు పాటించాలని కోరారు. అన్నదాతలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నిరుపేదల ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలందరికీ సీఎం తీపి కబురు అందిస్తారని, మరో రెండు, మూడు పథకాలు అమలు చేయనున్నట్లు తెలి పారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ తరహాలో వికారాబాద్‌లోని శివసాగర్‌ చెరువును అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం అనన్య మాటా డుతూ.. ప్రజా ప్రభుత్వంలో వికారాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ మెంబర్‌ రంగరాజు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అర్థ సుధాకర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement