ప్రభుత్వానికి అండగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి అండగా నిలవాలి

Oct 17 2026 8:18 AM | Updated on Oct 17 2026 8:18 AM

● సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోవిద్యా వ్యవస్థ బలోపేతం ● నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి

అనంతగిరి: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల వికారాబాద్‌ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ మల్లు రవి కోరారు. శుక్రవారం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి కిందిస్థాయి నుంచి వచ్చిన కార్యకర్త అన్నారు. ఆయన గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముందుగా గ్రామస్థాయిలో ఓటరు నమోదు ప్రక్రియను క్రియశీలకంగా చేపట్టాలన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో ఇద్దరికి బాధ్యతలు అప్పగించాలన్నారు. పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ కై వశం చేసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికొదిలేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో విద్యా వ్యవస్థ బలోపేతం అయ్యిందన్నారు. ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్‌ స్థాయి విద్య అందాలనే సంకల్పంతో వందకు పైగా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు డీఏలు అందజేశారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్‌రెడ్డి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ కిషన్‌నాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్‌ ముదిరాజు, మహేందర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు అనంత్‌రెడ్డి, నర్సింలు, రాంచంద్రారెడ్డి, చామల రఘుపతిరెడ్డి, విజయ్‌కుమార్‌, పురుషోత్తంరెడ్డి, శంకర్‌, బాదం అశోక్‌, రాఘవేందర్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement