చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Oct 17 2026 8:18 AM | Updated on Oct 17 2026 8:18 AM

● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక

ధారూరు: కార్మిక చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఏ రాధిక అన్నారు. అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ధారూరు మండలం నాగసమందర్‌ గ్రామంలో శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పని ప్రదేశంలో రోజుకు 8గంటలే పని చేయాలనేది చట్టం చెబుతోందన్నారు. లేబర్‌ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు విధిగా కార్డు పొందాలని సూచించారు. కార్యక్రమంలో అంకిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ ప్రకాశ్‌కుమార్‌, సంస్థ ఫీల్డ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌ వెంకటేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement