తాండూరు టౌన్: పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని తాండూరు పట్టణంలో శుక్రవా రం నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఇందిరాచౌక్ నుంచి సెయింట్ మార్క్స్ పాఠశాల వరకు ర్యాలీ సాగింది. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, పట్టణ సీఐపరమేశ్వర్ గౌడ్, పోలీసు సిబ్బంది, సహారా క్రికెట్ అకాడమీ క్రీడాకారులు, కృష్ణవేణి కాన్సెప్ట్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్గా విధులునిర్వర్తించడం ఎంతో కష్టసాధ్యమని, అనేక ఒడిదుడుకులను తట్టుకుని శాంతిభద్రతలను పరిరక్షించాల్సి వస్తుందన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు ప్రాణాలను సైతం త్యాగం చేయాల్సి వస్తోందన్నారు.


