పాలపిట్టను నిర్బంధిస్తేజైలు, జరిమానా | - | Sakshi
Sakshi News home page

పాలపిట్టను నిర్బంధిస్తేజైలు, జరిమానా

Oct 17 2026 8:18 AM | Updated on Oct 17 2026 8:18 AM

బొంరాస్‌పేట: దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర పక్షి పాలపిట్టను నిర్బంధిస్తే వన్యప్రాణుల సంరక్షణ చట్ట ప్రకారం మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా ఉంటుందని కొడంగల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ యాదగిరి హెచ్చరించారు. శుక్రవారం దుద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమతులు లేకుండా ఎవరూ అడవుల్లోకి వెళ్లరాదని సూచించారు. వన్యప్రాణుల స్వేచ్ఛకు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం పాలపిట్ట సంరక్షణ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధికారులు ఫారూఖ్‌ అలీ, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జనావాసంలోకి జింక

కుల్కచర్ల: పొలాల్లోకి వచ్చిన జింకను వీధి కు క్కలు తరమడంతో అది తప్పించుకునే క్రమంలో జనావాసాల్లోకి వచ్చింది. ఈ ఘటన కుల్కచర్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని రామలింగేశ్వర కళాశాల వద్ద గల పొలాల్లోకి జింక వచ్చింది. దీంతో వీధి కుక్కలు వెంటపడ్డాయి. గమనించిన యువకులు కుక్కలను తరిమి జింకను కాపాడారు. విషయాన్ని పోలీసులు, అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. రేంజర్‌ పీర్యనాయక్‌ గ్రామానికి చేరుకొని జింకను సమీప అటవీ ప్రాంతంలో వదిలేందుకు తీసుకెళ్లారు. కుక్కల నుంచి జింకను కాపాడిన యువకులు సత్యం, అంజిలయ్య, శ్రీనును అధికారులు అభినందించారు.

‘లక్కీ’ విజేతలు

డ్రా పద్ధతిన బార్ల కేటాయింపు

అనంతగిరి: జిల్లాలో కొత్త బార్ల కేటాయింపునకు శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో లాక్కీ డ్రా తీశారు. పరిగి పట్టణానికి చెందిన కే సోమలింగం, కొడంగల్‌కు చెందిన అనిల్‌కు అదృష్టం వరించింది. అదనపు కలెక్టర్‌ వెంకటాచారి లాటరీ తీసి విజేతలను ప్రకటించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా నాకాబందీ

ఎస్పీ స్నేహ మెహ్ర

అనంతగిరి: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల కట్టడి, రహదారి భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నాకాబందీ నిర్వహించారని ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. వికారాబాద్‌, పరిగి, తాండూరు డివిజన్ల పరిధిలోని 20 పోలీస్‌ స్టేషన్లకు సంబంధించిన 36 తనిఖీ కేంద్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. వాహనాలను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని వాటిని సీజ్‌ చేసినట్లు చెప్పారు.

పేదలకు వరం కల్యాణలక్ష్మి

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

నవాబుపేట: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం నవాబుపేట ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ రంగారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ నవీన్‌ కుమార్‌ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, సర్పంచులు శ్రీధర్‌, సంతోష్‌ రెడ్డి, జగన్‌ రెడ్డి, నాయకులు పరమేష్‌, నాగిరెడ్డి, నరసింహారెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement