కొడంగల్: గ్రామీణ ప్రాంతాల్లో విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్లూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో శుక్రవారం రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీయూడబ్లూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి శ్రీకిషన్ రావు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. సమగ్ర మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. పాత్రికేయుల భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేసే పాత్రికేయుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో పాత్రికేయులు పకీరప్ప, కానుకుర్తి రమేష్, ఆవుల శ్రీకాంత్, రాం నరేష్, ప్రభాకర్, నరేష్, ఆబీద్ తదితరులు పాల్గొన్నారు.


