పరిగి: గుడిలో గ్రామసభ నిర్వహించడంపై పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని మిట్టకోడూరులోని గుడిలో గ్రామసభ నిర్వహించారు. దీంతో గ్రామస్తులు, వార్డు సభ్యులు పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కేవలం ముగ్గురు మెంబర్లతో సభ ఎలా నిర్వహిస్తారని మిగిలిన సభ్యులు ప్రశ్నించారు. కార్యదర్శి, సర్పంచ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ కార్యాలయంలో నిర్వహించాల్సిన సభను గుడిలో ఎందుకు నిర్వహించారో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ జీపీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.


