నవాబుపేట: ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టి నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలను పొంచుకోవచ్చని కేంద్ర భూగర్భ జల మండలి సీనియర్ శాస్త్రవేత్త, జల్ శక్తి అభియాన్ ప్రధాన నోడల్ ఆఫీసర్ శ్రీనివాస విట్టల్, డిప్యూటీ డీఆర్‌డీఓ సత్తయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని మైతాభ్ ఖాన్ గూడ గ్రామంలో గాంధీ జయంతి పురస్కరించుకొని సర్పంచ్ తెలుగు దుర్గయ్య ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జల్ శక్తి అభియాన్‌లో భాగంగా చెరువుల అభివృద్ధితో పాటు ఇంకుడు గుంతలు, నీటి కుంటలు నిర్మించుకోవాలని సూచించారు. నీటి సంరక్షణ పనులు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు వర్షపు నీరు వృథాగా వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేస్తే కార్యక్రమం మరింత విజయవంతమవుతుందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. పారిశుద్ధ్యం తాగునీరు, పచ్చదనం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అనురాధ, ఏపీఓ లక్ష్మిదేవి, ఉప సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శోభరాణి, వార్డు సభ్యులు, విబీజీరామ్ జీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు పూర్తిస్థాయిలో పనులు కల్పించాలి
జల్‌శక్తి అభియాన్ ప్రధాన నోడల్ ఆఫీసర్ శ్రీనివాస విట్టల్


