అనంతగిరి: సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశం మందిరంలో పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఉమాశంకర్ ప్రసాద్, వెంకటాచారి, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, జిల్లా అధికారులు మాధవరెడ్డి, జయపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున గౌడ్, కార్యదర్శి వెంకటయ్య గౌడ్, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


