ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

Aug 19 2026 9:10 AM | Updated on Aug 19 2026 9:10 AM

కొడంగల్‌ రూరల్‌: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని కర్ణాటక రాష్ట్రం జాకన్‌పల్లి మఠాధిపతులు షట్‌స్థల బ్రహ్మ గవిసిద్ధలింగ మహాస్వామి అన్నారు. శ్రావణమాసం సందర్భంగా మంగళవారం టేకుల్‌కోడ్‌లో సంచార ఇష్టలింగ పూజ, సామూహిక ఇష్టలింగ పూజ నిర్వహించారు. అనంతరం ఆయన ప్రవచనాలు అందించారు. ప్రజలందరూ భక్తిభావన కలిగి ఉండాలని, ప్రేమాభిమానాలతో మెలగాలని, చెడు అలవాట్లు, సహవాసాలకు దూరంగా ఉండాలని చెప్పారు. కొంత సమయం ధ్యానం, దైవ చింతన, భజన కార్యక్రమాలతో మెలగడం వల్ల సుఖశాంతులతో జీవించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో గ్రామ పురోహితులు జగదీశ్వర్‌స్వామి, అడ్వకేట్‌ బస్వరాజ్‌, శాంతికుమార్‌, గోవర్దన్‌రెడ్డి, లింగారెడ్డి, సర్పంచ్‌ రాజు, ఉపసర్పంచ్‌ పురుషోత్తంరెడ్డి, గుండప్ప, భీంరెడ్డి, బసవరాజ్‌, గాండ్ల బస్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement