భూ సమస్య పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

భూ సమస్య పరిష్కరించండి

Aug 19 2026 9:10 AM | Updated on Aug 19 2026 9:10 AM

యాలాల: మండల పరిధిలోని దౌలాపూర్‌, చెన్నారం, గిరిజాపూర్‌ గ్రామాల రైతుల భూ సమస్యను పరిష్కరించాలని వ్యకాస, ఎమ్మార్పీఎస్‌ నాయకులు బుగ్గప్ప, మహేందర్‌ కోరారు. ఈ విషయమై మంగళవారం తహసీల్దార్‌ గాయత్రిని బాధిత రైతులతో కలిసి మాట్లాడారు. దౌలాపూర్‌ పరిధి సర్వే నెంబరు 73లో చెన్నారం, దౌలాపూర్‌ దళిత, వడ్డే కులస్తులకు 1980వ సంవత్సరంలో 11 కుటుంబాలకు 25 ఎకరాల భూమిని పంపిణీ చేసిందన్నారు. ప్రతి కుటుంబానికి రెండెకరాల చొప్పున భూపంపిణీ చేసిన తరువాత, ఇట్టి ప్రదేశంలో రైతులకు సమాచారం లేకుండా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మా ణ పనులంటూ భారీ స్థాయిలో మొరం తరలింపు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ విషయంలో బాధిత రైతులకు న్యాయం చేయాలని తహసీల్దార్‌కు మొర పెట్టుకున్నారు. ఇందుకు స్పందించిన తహసీల్దార్‌ బుధవారం సర్వే చేయిస్తానని, సర్వే రిపోర్టు అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు చంద్రమ్మ, అంజిలమ్మ, వెంటకమ్మ, మాన్యప్ప, అమృతమ్మ ఉన్నారు.

గ్రామకంఠం భూమిని కబ్జా నుంచి రక్షించండి గ్రామ కంఠం భూమి కబ్జాకు గురై, అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవా లని గోరేపల్లి సర్పంచ్‌ వై.లక్ష్మి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై మంగళవారం తహసీల్దార్‌ గాయత్రి, ఎంపీడీఓ శ్రీనిజకు వార్డు సభ్యులు, గ్రామస్తులతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామ కంఠం భూమిలో కొందరు గ్రామస్తులు కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. కబ్జా చేస్తున్న వారితో పాటు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసు కోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో ఉప సర్పంచ్‌ కిష్టమ్మ సందప్ప, వార్డు సభ్యులు శ్రీశైలం, సందప్ప, జిట్టా రోషన్‌, మల్లేషం, మధుసూదన్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement