షీటీం సేవలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

షీటీం సేవలపై అవగాహన

Aug 19 2026 9:10 AM | Updated on Aug 19 2026 9:10 AM

అనంతగిరి: వికారాబాద్‌లోని వేదిక్‌ హైస్కూల్‌లో మంగళవారం షీటీం సేవలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాల్య వివాహాలు, మహిళల భద్రత, సైబర్‌ నేరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వికారాబాద్‌ టౌన్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలన్నారు. సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ స్థాయిలో కష్టపడి చదివితే ఉన్నత స్థాయిలో ఎదగవచ్చని తెలిపారు. బాల్య వివాహాలు చేయడం నేరమన్నారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో షీటీం ఇంచార్జి బుచెందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌, కళా బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement