అనంతగిరి: వికారాబాద్‌ను డ్రగ్స్, నేర రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేద్దామని అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా అన్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా క్రైం టీమ్‌కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల దర్యాప్తు విధానం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మార్గాల గుర్తింపు, నిందితులపై నిఘా, సాంకేతిక ఆధారాల వినియోగం, మాదకద్రవ్యాల స్వాధీనం, చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించారు. జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరా వినియోగాన్ని అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా పకడ్బందీగా పనిచేయాలన్నారు. అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులు, నెట్‌వర్క్‌లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్‌రాయ్, జిల్లా క్రైం టీం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా


