జింకను తరిమిన కుక్క | - | Sakshi
Sakshi News home page

జింకను తరిమిన కుక్క

Mar 20 2026 10:06 AM | Updated on Mar 20 2026 10:06 AM

కాపాడిన యువకులు

పూడూరు: అడవిలో నుంచి పొలాల్లోకి వచ్చిన జింకను ఓ కుక్క తరుముతుండగా యువకులు కాపాడారు. ఈ ఘటన మండలంలోని అంగడిచిట్టంపల్లిలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి ఐదు కిలో మీటర్ల దూరంలో దామగుండం అటవీ ప్రాంతం ఉంది. అక్కడి నుంచి ఓ జింక సమీప పొలాల్లోకి వచ్చింది. దాన్ని చూసిన కుక్క వెంటపడింది. గమనించిన యువకులు జింకను కాపాడారు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ యాదవరెడ్డి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని జింకను వైద్య నిమిత్తం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ యాదవరెడ్డి మాట్లాడుతూ.. అడవి జంతువులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జింకను కాపాడిన యువకులను అభినందించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు కుమార్‌, శ్రీకాంత్‌, యువకులు శివ, మహేందర్‌, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement