పైలెట్ ఫాంహౌస్ ఘటన నేపథ్యంలో చర్చ
వికారాబాద్: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో కొకై న్ దొరికిన నేపథ్యంలో జిల్లాలో చర్చ మొదలైంది. రెండు రోజుల క్రితం మొయినాబాద్ సమీపంలోని ఫాంహౌస్‌లో పైలెట్‌తోపాటు ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ, ఇతర నేతలు ఈగల్ టీమ్‌కు చిక్కిన విషయం తెలిసిందే. డ్రగ్స్ తీసుకోవడంతోపాటు పోలీసులపై కాల్పులు జరిపిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేనే డ్రగ్స్ ఘటనలోనూ ముఖ్య పాత్ర ఉండటంతో జిల్లాలో ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతోంది. దీంతో ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కిపెడుతున్నారు. జిల్లాలోనూ డ్రగ్స్ మూలాలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇటీవలి కాలంలో రిసార్ట్స్, ఫాంహౌస్ కల్చర్ పెరిగిపోయింది. వీకెండ్స్‌లో నగరం నుంచి వేల సంఖ్యలో సాఫ్ట్‌వేర్లు, ఇతర పర్యాటకులు వచ్చి రాత్రిళ్లు బస చేసేందుకు జిల్లా కేంద్రానికి అనుకుని ఉన్న రిసార్ట్స్‌ను ఎంచుకుంటున్నారు. గతంలో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఓ రిసార్ట్స్ కూడా పైలెట్ అండదండలతోనే ఏర్పాటు చేశారనే ఆరోపణలు వచ్చాయి.
మన టీంలు ఎక్కడ?
మొయినాబాద్ ఫాంహౌస్‌పై ఈగల్, ఎస్‌ఓటీ టీంలు దాడి చేసి డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న బడాబాబు లను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాల పనితీరుపై చర్చ మొదలైంది. ఇటు పోలీసులు అటు ఎకై ్సజ్ శాఖలోనూ ఎస్‌ఓటీ, టాస్క్ ఫోర్స్ బృందాలు ఉన్నాయి. వీరు అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్తీ టీ పౌడర్, గుట్కాలు పట్టుకోవడంలాంటి వాటికే పరిమితమవున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పు డు ఒకటి అరా గంజాయి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. వాటి మూలాల జోలికి వెళ్లరనే అపవాదు ముటగట్టుకున్నారు. గంజా సరఫరా చేస్తున్నది ఎవరు? వారి వెనక ఉన్నదెవరు అనే కోణంలో దర్యాప్తు సాగడం లేదు. వ్యసనపరులను పట్టుకోవడంతో సరిపెడుతున్నా రు. ఎలాంటి అనుమతులు లేని రిసార్ట్స్ జోలికి వెళ్లరు. వాటిలో రాత్రిళ్లు మద్యం తాగి చిందులు వేయడం, అనంతగిరి పారెస్టులో ఉన్న వన్య ప్రాణు లు బయపడేలా డీజేలు పెట్టడం, డ్యాన్సులు చేయ డం లాంటివి యథేచ్ఛగా సాగిస్తున్న చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా రిసార్ట్స్ నిర్వహిస్తున్నా అధికారులకు పట్టడం లేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి అక్రమం అంటూ సీజ్ చేస్తున్నారు. ఐదారేళ్ల తర్వాత అక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఒక వేళ సీజ్ చేసినా నెల తిరక్కుండానే మళ్లీ తెరుచుకోవడం అధికారుల పని తీరుకు అద్దం పడుతోంది. అక్రమ ఫాంహౌస్‌లపై నిగ్గుతేలుస్తామ ని కమిటీలు వేసినా నివేదికలు మాత్రం బయటపెట్టరు. ఎలాంటి చర్యలు కూడా ఉండవు.. తప్పులు కళ్ల ముందే కనిపించినా పట్టించుకోరు.. ఇది జిల్లాలో కొంత కాలంగా నడుస్తున్న తీరు. ఎకై ్సజ్, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాలు సమర్థవంతంగా పని చేస్తే మొయినాబాద్ లాంటి ఘటనలు అనేకం వెలుగు చేసే అవకాశం లేకపోలేదని స్థానికులు బాహాటంగానే అంటున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా..
రిసార్ట్స్ ఏర్పాటు చేయాలంటే ముందుగా పోలీసు, గ్రామ పంచాయతీ, డీపీఓ, రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్, ఫారెస్టు తదితర శాఖల నుంచి అనుమతులు, ఎన్‌ఓసీలు పొందాలి. కానీ నిర్వాహకులు ఇవేవీ పట్టించుకోకుండా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. పర్యాటకుల నుంచి ఒక్కరోజుకు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వికారాబాద్ సమీపంలో వైల్డర్‌నెస్ క్యాప్ సైట్, పెంగ్విన్, మూన్‌లైట్ అడ్వెంచర్, టిక్కి విలేజ్, నేచర్ రిట్రీట్, హరివిల్లు, అవని ఫార్మ్ పేరిట రిసార్ట్స్ నిర్వహిస్తున్నారు. గతంలో పూడూరు మండల పరిధిలోని పలు రిసార్టులకు అనుమతులు లేకపోవడంతో అధికారులు మూసివేశారు. నెల తిరక్కుండనే ఓపెన్ కావడం విమర్శలకు తావిస్తోంది.
మనవద్దా డ్రగ్స్ మూలాలున్నట్లు
అనుమానాలు
రిసార్ట్స్, ఫాంహౌస్‌లలో దందా
పట్టించుకోని ఎస్‌ఓటీ,
టాస్క్‌ఫోర్స్ పోలీసులు


