మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
నవాబుపేట: వివాహేతర సంబంధం బయట పడుతుందని ఓ మహిళను హత్య చేసిన ఉదంతమిది. ఇటీవల మండలంలోని ఎల్లకొండ గ్రామ శివారులో మహిళను హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. మోమిన్‌పేట సీఐ వెంకట్ వివరాలు వెల్లడించారు. శంకర్‌పల్లిలోని గణేష్‌నగర్‌కు చెందిన మీనపల్లి బాలమణి(45) గత నెల 28న ఎల్లకొండ జాతరకు బంధువుల వద్దకు వచ్చింది. అదే గ్రామానికి చెందిన నాయకుడి శ్రీనివాస్‌తో ఆమెకు ఇదివరకే వ్యక్తిగత సంబంధం ఉంది. అది బయట పడుతుందని ఆమైపె ద్వేషాన్ని నింపుకొన్నాడు. ఎలాగైనా అంతం చేద్దామని పథకం పన్నాడు. ఈ క్రమంలో ఆమెను శ్రీనివాస్ గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమైపె దాడి చేసి, ఒంటిపై ఉన్న బంగారం వెండి ఆభరణాలను లాక్కున్నాడు. కత్తితో మెడ కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. మృతురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శాసీ్త్రయ, సాంకేతిక సమాచారంతో నిందితున్ని పట్టుకొని విచారించారు. ఇందులో భాగంగా బాలమణిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. కేసు నమోదు చేసి వికారాబాద్ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపాడు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, డీఎస్పీ శ్రీనివాస్‌ల పర్యవేక్షణలో కేసులు ఛేదించినట్లు తెలిపారు.


