ధారూరు: మండలంలోని అల్లాపూర్ పంచాయతీకి సొంత భవనం లేకపోవడంతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనంలో జీపీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, పంచాయతీ పాలక వర్గం ఒకే గదిలో ఉండాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ వైపు విద్యార్థులు, మరో వైపు పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి కూర్చోవాల్సి వస్తోంది. సమస్యలపై ఎవరైనా వస్తే సర్పంచ్ పాఠశాల బయటికి వెళ్లి మాట్లాడాల్సి వస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అల్లాపూర్‌కు జీపీ హోదా వచ్చింది. అప్పట్లో భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయి. పనులు ప్రారంభ దశలోనే ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసు కోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
● ఓ వైపు విద్యార్థులు..
మరో వైపు పాలకవర్గం
● ఇబ్బందుల్లో బోధన


