కుటుంబ కలహాలతో మహిళ బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో మహిళ బలవన్మరణం

Mar 5 2026 8:47 AM | Updated on Mar 5 2026 8:47 AM

మంచాల: కుటుంబ కలహాలతో ఓ మహి ళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆరుట్లలో బుధవారం వెలుగులోకి వచ్చింది. మంచాల సీఐ మధు తెలిపిన ప్రకారం.. గ్రామా నికి చెందిన జోగు సుదర్శన్‌తో ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన సంధ్యారాణి (45)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం. దంపతులు తరచూ గొడవపడుతుండడంతో గ్రామస్తులు పలుమార్లు సర్ధిచెప్పారు. వారిలో మార్పు రాకపోవడంతో మనస్తాపం చెందిన సంధ్యారాణి మంగళవారం రాత్రి పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి పిల్లలు, బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు సుదర్శన్‌పై కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఇబ్రహీంపట్నం ప్రభు త్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం ఆరుట్లలో అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement