శ్రీవారి సేవలో కుక్కింద భజనమండలి
ధారూరు: తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో మండల పరిధిలోని కుక్కిందకు చెందిన హనుమాన్ భజన బృందం సభ్యులు శనివారం రాత్రి హరినామ సంకీర్తనలు ఆలపించారు. టీటీడీ దేవస్థానం హిందూ ధార్మిక సంస్థ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన భజనమండలి సభ్యులు వేంకటేశ్వర స్వామి, రాకంచర్ల వెంకటదాసుల వారి కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా వారు తమకు అవకాశం కల్పించడంపై దేవస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భజన మండలి పంతుళ్లు అనంతయ్య, శివ్వయ్యచారి, సభ్యులు పెంటయ్య, కిష్టయ్య, సుధాకర్, నారాయణ, వెంకటయ్య, కార్తీక్‌చారి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


