సిబ్బంది కొరతతో ఇబ్బంది
దౌల్తాబాద్: విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా సేవలందించేందుకు సరిపడా సిబ్బంది అందుబాటులో ఉండాలి. అయితే మండలంలో అత్యవసర సమయంలో ఆటంకం లేకుండా విద్యుత్ సేవలు అందించేందుకు ఉన్న ట్రాన్స్‌కో సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతుంది. మండల పరిధిలో ఐదు సబ్‌స్టేషన్లు ఉండగా వీటి పరిధిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.
పెరిగిన ఒత్తిడి
దౌల్తాబాద్, సురాయిపల్లి, సర్సాపూర్, గోకఫసల్‌వాద్, బాలంపేట గ్రామాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. ఈ సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు జేఎల్‌ఎం (జూనియర్ లైన్‌మెన్)లతోనే విధులు కొనసాగిస్తున్నారు. ఏఎల్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గోకఫసల్‌వాద్ సబ్‌స్టేషన్ పరిధిలో కేవలం ఆర్టిజన్ మాత్రమే ఉన్నారు. ఆ సబ్‌స్టేషన్‌లో ఆపరటర్లు లేకపోవడంతో జేఎల్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నా అఖిలేష్‌ను కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఆపరేటర్లు లేక చాలా ఇబ్బందిగా మారింది. ఐదు సబ్‌స్టేషన్‌లకుగాను ఒక ఏఈ, ఒక ఫోర్‌మెన్, ఇద్దరు లైన్ ఇన్‌స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా ఫోర్‌మెన్, ఒక లైన్‌ఇన్‌స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఆరు జేఎల్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆపరేటర్ల కొరత ఉంది. దీంతో వానాకాలంలో ఎక్కడ విద్యుత్ ఆటంకం కలిగినా ఉన్న సిబ్బందిపై అదనపు పనిభారం పడుతుంది. ఇప్పటికై నా ట్రాన్స్‌కో అధికారులు స్పందించి సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
మండలంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ల పరిధిలో సిబ్బంది కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సబ్‌స్టేషన్‌ల పరిధిలో ఎక్కడ విద్యుత్ సమస్య అంతరాయం లేకుండా సేవలందిస్తున్నాం.
– మహిపాల్, ఏఈ, దౌల్తాబాద్
విద్యుత్ సబ్‌స్టేషన్లలోని ఉద్యోగులకు పనిభారం


