కేంద్రంపై ఐక్యంగా పోరాడుదాం
సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ సాగర్
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలు వెనక్కు తీసుకునే వారకు ఐక్యంగా పోరాడుదామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్, పద్మ, వెంకన్న, వెంకటయ్య, నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం వికారాబాద్ మండలం సిద్ధులూరు, జైద్‌పల్లి, ధారూర్ మండలం కెరేల్లి గ్రామాల్లో, వికారాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల నుంచి సంతకాలు సేకరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ... భారతదేశం అమెరికాతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలన్నారు. విద్యుత్ బిల్లు 2025, విత్తన బిల్లు 2025 ఉపసంహరించుకోవాలన్నారు. వీ బీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. , పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని, స్కీమ్ వర్కర్లు సహా కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలపై ప్రారంభించిన దాడులన్నింటినీ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. బహుళ జాతి కంపెనీల విత్తనాలను దిగుమతి చేసుకోవడం, ఇష్టానుసారంగా వసూలు చేసే స్వేచ్ఛ, విత్తనాల బ్లాక్ మార్కెటింగ్ చేయడానికి అనుమతించే కొత్త విత్తన బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. మార్చి 10 వ తేదీ నుంచి ఏప్రిల్ 13 వరకు దేశవ్యాప్తంగా మహా పంచాయత్‌లు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఎం జిల్లా నాయకులు మహిపాల్, మహేందర్, సుదర్శన్, సత్యనారాయణ, గీత, ప్రభు లింగం, సురేశ్, అనంతయ్య, ప్రవీణ్ కుమార్, మల్లేశ్, బసిరెడ్డి, ఆనందం, రాజు, పెంటయ్య, అనసూయ, నర్సింలు, రాజు, లక్ష్మి, వెంకటమ్మ వివిధ గ్రామాల రైతులు కూలీలు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలి
ధారూరు: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను ఉపసంవరించుకోవాలని సంయుక్త కిషన్ మోర్చా(ఎస్‌కేఎం) డిమాండ్ చేసింది. ఆదివారం మండల పరిధిలోని కేరెళ్లి గ్రామం ఎస్‌కేఎం అధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రైతులు, కార్మికులు, కూలీలకు వ్యతిరేకంగా తీసుకవచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. వీబీజీ రామ్‌జీ చట్టం పేరును మార్చితే సరిపోదని.. వంద శాతం నిధులు కేటాయించి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఇతర దేశాల దిగుమతులపై జీఎస్టీ పన్నులు లేకుండా చూడాలన్నారు. మార్కెట్ యార్డుల్లో రైతులకు వసతులు కల్పించాలని కోరారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకవచ్చిన జీఓలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్‌కేఎం రాష్ట్ర నాయకులు తీగల సాగర్, మండలి వెంకన్న, వెంకటరాములు, పద్మ నాగిరెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్, ఎస్‌కేఎం జిల్లా కన్వీనర్ గీత మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


