సర్పంచ్‌ల బాధ్యత చాలా పెద్దది
బంట్వారం: సర్పంచ్‌ల బాధ్యత చాలా పెద్దదని, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో నూతన సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి హాజరై మాట్లాడారు. మంచి నీటి సరఫరా, వీధి లైట్లు, పారిశుద్ధ్యం పనులు సక్రమంగా చేపట్టాలన్నారు. రానున్న వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. క్రమం తప్పకుండా ఇంటి పన్నులు వసూలు చేయాలని సూచించారు. గ్రామ సభలు వాయిదా వేయకుండా సకాలంలో నిర్వహించాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. అనంతరం ఎంపీడీఓ హేమంత్ సర్పంచ్‌లను మర్యాద పూర్వకంగా సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ సురేందర్‌రెడ్డి, ఎంఈఓ చంద్రప్ప, ఏఓ కరుణాకర్‌రెడ్డి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ బ్లెస్సీ, పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు


