
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
తాండూరు రూరల్: విద్యార్థులు కష్టపడి చదివి శాస్త్రవేత్తలుగా ఎదగాలని తాండూరు వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ అన్నారు. పెద్దేముల్ మండలం గొట్లపల్లి శివారులోని తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులకు పర్యావరణం, సేంద్రియ సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటల రక్షణ కోసం రైతులు క్రిమిసంహారక మందులు వాడుతున్నారని, తద్వారా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. దీన్నిదృష్టిలో ఉంచుకొని సేంద్రియ వ్యవసాయం చేయాలని తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. రోజురోజుకు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. దీంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే శాసీ్త్రయ ఆలోచనలు పెంచుకొని మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గాయత్రి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
తాండూరు వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్