
డబ్బు తీసుకుని విరాసత్ చేయించలేదు
పూడూరు: భూమి విరాసత్ చేయించేందుకు రూ.50 వేలు తీసుకుని, పని చేయకుండా కాలయాపన చేస్తున్న పూడూరు మీ సేవ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ భరత్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. పూడూరుకు చెందిన చాకలి బుచ్చన్న తన భూమిని విరాసత్ చేయించాలని మీ సేవ నిర్వాహకుడు షాబాద్ సురేష్‌ను కలిశాడు. ఇందుకు లక్ష రూపాయలు అవుతుందని చెప్పగా.. మొదటి విడతగా రూ.50 వేలు ఫోన్ పే ద్వారా పంపాడు. పని పూర్తయిన తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. కానీ డబ్బులు తీసుకున్న సురేశ్ ఏడాదిన్నరగా తన పని చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తన డబ్బులైనా తిరిగి ఇవ్వమని కోరినా స్పందించడం లేదన్నాడు. అతనిపై చర్య తీసుకోవాలని తహసీల్దార్‌ను కోరాడు. ఇదిలా ఉండగా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న మీ సేవ కేంద్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేశ్‌పటేల్, పాండు, శ్రీశైలం తదితరులు డిమాండ్ చేశారు.
మీ సేవ నిర్వాహకుడిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు