
పరిగిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
● పరిగిలో వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమిపూజ
● పాల్గొన్న కలెక్టర్ ప్రతీక్‌జైన్
పరిగి: పరిగి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నిరు. బుధవారం పట్టణంలో వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. తహసీల్దార్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందాలన్న సంకల్పంతోనే వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇందుకు రూ.27 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ఎక్కువ దృష్టి సారించిందన్నారు. నస్కల్ గ్రామ సమీపంలో రూ.10 కోట్లతో మహిళల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఈ ప్రాంతానికి సాగునీరు తెస్తామని హామీ ఇచ్చారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ వెంకటేశ్వరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు చిన్న నర్సింహులు, శ్రీను, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్‌గాంధీ సేవలు మరువలేం
దేశానికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలు ఎప్పటికి మరువలేమని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నా రు. బుధవారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్‌గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్‌గాంధీ అని కొనియాడారు.
పేదల సంక్షేమమే లక్ష్యం
దోమ: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం దోమ మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ కింద మంజూరైన కుట్టుమిషన్లను అర్హులైన మహిళలకు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ జాకటి వెంకటయ్య, నాయకులు మాలి శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళల అభ్యున్నతికి కృషి
కుల్కచర్ల: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలో మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ కింద మంజూరైన కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. మహిళలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, మాజీ ఎంపీపీ సత్యమ్మ పాల్గొన్నారు.