
రైతులకు పరిహారం అందించాలి
అనంతగిరి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వికారాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎకరాకు రూ.లక్ష నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేయాలన్నారు. పత్తి, మొక్కజొన్న, వరి, కంది, పసుపు, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్