
సత్వరం పూర్తి చేయాలి
● దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం డాక్టర్ గోపాలకృష్ణన్
● తాండూరు రైల్వే స్టేషన్ సందర్శన
తాండూరు: అమృత్ భారత్ నిధులతో రైల్వే స్టేషన్లలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు భారీ వర్షాలు అడ్డంకిగా మారాయని దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం డాక్టర్.గోపాలకృష్ణన్ తెలిపారు. బుధవారం తాండూరు రైల్వే స్టేషన్‌ను అధికారులతో కలిసి సందర్శించారు. అమృత్ భారత్ స్కీం కింద రూ.24 కోట్లతో తాండూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఎస్కులేటర్, ట్రాలీ రూట్, వెయిటింగ్ హాల్, టికెట్ కౌంటర్ తదితర పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం తాండూరు మార్వాడి యువ మంచ్ ప్రతినిధులు డీఆర్‌ఎంను కలిసి తాండూరులో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చూడాలని వినతిపత్రం అందజేశారు.