
మద్యానికి బానిసై.. ఉరివేసుకుని
డ్రైవర్ బలవన్మరణం
మొయినాబాద్: మద్యానికి బానిసైన ఓ డ్రైవర్ కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్‌కు చెందిన కావలి వెంకటేశ్ (48) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసై తరచూ భార్యను వేధించేవాడు. దీంతో ఆమె ఇటీవల పుట్టింటికి వెళ్లింది. శనివారం మధ్యాహ్నం వెంకటేశ్ మద్యం మత్తులో భార్యకు ఫోన్ చేసి తాను ఉరివేసుకుని చనిపోతున్నానని చెప్పాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి పరిశీలించారు. మద్యం మత్తులో ఉండడంతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లకుండా ఇంటిదగ్గరే వదిలి వెళ్లారు. అర్థరాత్రి సమయంలో మద్యం మత్తులోనే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.