
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అదృశ్యం
శంషాబాద్ రూరల్: వేర్వేరు ఘటనలో ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి సమాచారం మేరకు... మహారాష్ట్రకు చెందిన సూర్యవంశీ రాజేంద్ర(35), పూజ దంపతులు ఉపాధి కోసం పదేళ్ల కిందట వలస వచ్చి ఇందిరానగర్ దొడ్డిలో నివామసుంటున్నారు. ఈ నెల 10న పూజ ఉదయం పనికి వేళ్ల సమయంలో రాజేంద్ర ఇంట్లోనే ఉన్నాడు. స్వగ్రామం వెళ్తానని చెప్పాడు. అదే రోజు సాయంత్రం పూజ పని నుంచి తిరిగి ఇంటికి వచ్చి చూడగా.. ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. భర్తకు చెందిన దుస్తులు, బ్యాగు కనిపించలేదు. అతను స్వగ్రామం వెళ్లి ఉంటాడని భావించింది. దీంతో భర్తకు ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ అయింది. అత్తకు ఫోన్ చేసి అడగగా అక్కడకు రాలేదని చెప్పింది. దీంతో అతని కోసం అన్ని చోట్ల వెతికినా జాడ తెలియకపోవడంతో ఆదివా రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో...
ముచ్చింతల్‌కు చెందిన బొడ్డు రత్నం(48) ఈ నెల 13న నందిగామ మండలం చేగూరులో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లాడు. అదే రోజు రాత్రి రత్నం భార్య మంజుల తన కూతురుకు ఫోన్ చేసి వాకబు చేసింది. అతను కూతురు వద్దకు వెళ్లలేదని తెలియడంతో అన్ని చోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అదృశ్యం

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అదృశ్యం