
మరమ్మతు చేపట్టరు సరఫరా పునరుద్ధరించరు
వృథాగా భగీరథ నీరు
దుద్యాల్: మిషన్ భగీరథ నీరు వృథా అవుతోంది. మండల కేంద్రంలో రోడ్డు మధ్యలో పైపులైన్ పగిలి నీరు రోడ్డుపాలు అవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాల రకపోకల వలన పైపులైన్ ధ్వంసం అయింది. దీని కారణంగా దుద్యాలకు రావాల్సిన నీరు సరిపడా రావడం లేదని ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. కానీ గ్రామంలోని పలు వీధులకు గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని తెలిపారు. పైపులైన్‌కు మరమ్మతు చేసి, సరఫరాను పునరుద్ధరించాలని భగీరథ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
పరిగి: స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధి బసిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందశాతం రిక్రూట్‌మెంట్ చేయాల్సిన పోస్టులను.. 2024 డీఎస్సీలో 30శాతం చేసి, మిగతా 70శాతం పదోన్నతులు కల్పించడం సరికాదని పేర్కొన్నారు. కేంద్రం 2016లో తెచ్చిన విక లాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి, వందశాతం నియామ కం చేపట్టి, ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.
అనంతగిరి: ఈ నెల 19న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు వికారాబాద్‌కు రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు రమేష్‌కుమార్, శివరాజు, వడ్లనందు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఆయన ఇక్కడికి రానున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన్నెగూడ రోడ్‌లో, వికారాబాద్‌లో శివారెడ్డిపేట వద్ద కమలనాథులు ఘన స్వాగతం పలికి, ర్యాలీగా వస్తారని చెప్పారు. అనంతరం ఎన్నెపల్లి చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారన్నారు. అనంతపద్మనాభ స్వామి దర్శనం అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నా రని చెప్పారు. స్థానిక ఎన్నికలపై దిశానిర్ధేం చేయనున్నారని వెల్లడించారు.
ఆమనగల్లు: హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో అక్టోబర్‌లో నిర్వహించే లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన, మహాత్మాగాంధీ సుస్థిర మహావిజ్ఞాన సదస్సు పోస్టర్‌ను ఆదివారం పట్టణంలో లయన్స్‌క్లబ్ ఉపాధ్యక్షుడు పాపిశెట్టి రాము ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో గాంధీ భావజాలం ఉన్నట్లయితే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. గాంధీ గ్లోబల్ సాహితీ అధ్యక్షుడు గోపాల్‌జీ, విగ్రహాల ప్రదర్శన కమిటీ కో కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
షాబాద్: ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని ఆచార్య సోమశేఖర్, ఆచార్య గణపతి, ఆచార్య కేతన్ మహాజన్ పేర్కొన్నారు. మండల పరిధిలోని బోనగిరిపల్లి వద్ద ఉన్న మహర్షివేద గురుకులంలో ఆదివారం ఉపనయన సంస్కారం కార్యక్రమం నిర్వహించారు. యజ్ఞ హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కొంత సమయం దేవుడికి కేటాయించాలని సూచించారు. దేవాలయాలవద్దకు వెళ్లినప్పుడు నిష్టతో పూజలు చేయాలన్నారు.

మరమ్మతు చేపట్టరు సరఫరా పునరుద్ధరించరు