
నేడు, రేపుపాఠశాలలకు సెలవు
అనంతగిరి: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు, రేపు(గురు, శుక్రవారం) సెలవు ఇస్తున్నట్లు డీఈఓ రేణుకాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
సీజనల్ వ్యాధులు
ప్రబలకుండా చూడాలి
జిల్లా వైద్యాధికారి లలితాదేవి
మోమిన్‌పేట: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి లలితాదేవి పేర్కొన్నారు. బుధవారం మోమిన్‌పేట పీహెచ్‌సీని సందర్శించారు. 108 వాహనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు తక్షణ సేవలు చేసేందుకు వైద్యులు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి సుజల తదితరులు పాల్గొన్నారు.
బంట్వారం పీహెచ్‌సీ సందర్శన
బంట్వారం: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం డీఎంహెచ్‌ఓ లలితాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపైఅప్ర మత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. అనంతరం ఓపీ సేవలపై ఆరాతీశారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ రహీం, సీహెచ్‌ఓ విజయ్‌కుమార్, ఎల్‌టీ రవి, అంబులెన్స్ టెక్నిషియన్ శివకుమార్, పైలెట్ బాల్‌రాజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మరో రెండు డెంగీ కేసులు
తాండూరు టౌన్: వానాకాలం సీజన్ కావడంతో డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటలు తిరగక ముందే తాండూరు పట్టణ పరిధిలో మరో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన వైద్య, మున్సిపల్ సిబ్బంది ఉరుకులు పరుగులు తీశారు. మంగళవారం రాజీవ్ కాలనీలో ఓ వ్యక్తికి డెంగీ సోకిన విషయం విధితమే. తాజాగా బుధవారం గరీబ్ నగర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు డెంగీ బారిన పడ్డారు. స్థానిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు మాలాశ్రీ నేతృత్వంలో వైద్య సిబ్బంది ఆ వార్డుకు వెళ్లి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వార్డు పరిధిలో రసాయనాలను పిచికారీ చేయించారు. వర్షాకాలంలో పూలకుండీలు, టైర్లు, పాడైపోయిన వస్తువుల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమల లార్వాలు పెరిగే అవకాశం ఉందని, కావున నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు డాక్టర్ సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, ఏన్‌ఎంలు, ఆశావర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మత్తుతో జీవితం చిత్తు
మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి
తాండూరు టౌన్: మత్తు పదార్థాలకు బానిస లైతే జీవితం నాశనమవుతుందని మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్, గంజాయి వంటికి అలవాటు పడి తే జీవితం చీకటిమయం అవుతుందన్నారు. వ్యసనాలకు బానిసలు కాకుండా బాగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎదగాల న్నారు. అలాగే వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ పాల్గొన్నారు.

నేడు, రేపుపాఠశాలలకు సెలవు

నేడు, రేపుపాఠశాలలకు సెలవు