
గిరిజనుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ
అనంతగిరి: గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆది కర్మయోగి అభియాన్‌లో భాగంగా గిరిజనుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించడం తోపాటు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఇళ్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేకుంటే మంజూరు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి, డీపీఓ జయసుధ, డీఈఓ రేణుకాదేవి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవి, చల్మారెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ సుధీర్